Malladi Vishnu: కాశీనాయన క్షేత్రంలో కట్టడాలను కూల్చడం దురదృష్టకరం...! 1 y ago
AP : కాశీనాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చడం దురదృష్టకరమన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సనాతన ధర్మాన్ని కాపాడటమంటే ఇదేనా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు. ఈ క్షేత్రంపై దాడి కూటమి పెద్దలకు తెలిసే జరిగిందని, పవన్‌కు సమాచారం ఇవ్వకుండానే కట్టడాలను కూల్చివేశారా అని మండిపడ్డారు. కాశీనాయన వంటి గొప్ప క్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి సంబంధించిన శాఖ అధికారులు దాడులు చేయడం దురదృష్టకరమన్నారు.
కాశీనాయన క్షేత్రంపై దాడి చేసిన పది రోజులకు కూటమి పెద్దలే స్పందించారంటే అర్థమేంటని, కూలగొట్టడం దేనికి, కట్టిస్తామని హంగామా చేయడం దేనికని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హిందూ ధర్మంపై దాడి చేస్తూ, భక్తల మనోభావాలతో అసెంబ్లీలో డ్రామాలాడుతున్నారన్నారు. ఈ క్షేత్రం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో ఎన్నో దేవాలయాలను కూలగొట్టారని, గోదావరి పుష్కరాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలన అనేక మంది చనిపోయారని తెలిపారు.